NEWSTELANGANA

బ్రహ్మానందంకు వెంక‌య్య కంగ్రాట్స్

Share it with your family & friends

పుస్త‌కం అద్భుతం

హైద‌రాబాద్ – జ‌గ మెరిగిన న‌టుడు బ్ర‌హ్మానందం. ఎన్నో మైలు రాళ్లు ఆయ‌న దాటుకుని వ‌చ్చారు. న‌టుడిగానే కాదు సహృద‌యుడిగా, వ‌క్త‌గా, ర‌చ‌యిత‌గా, శిల్పిగా ఇలా ప‌లు రంగాల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నారు బ్రహ్మానందం. ఆయ‌న అస‌లు పేరు క‌న్నెగంటి బ్ర‌హ్మానంద చారి. ఆయ‌న విశ్వ బ్రాహ్మ‌ణ సామాజిక వర్గానికి చెందిన వారు.

ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని పైకి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో తెలుగు ఉప‌న్యాస‌కుడిగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు జంధ్యాల క‌న్నుల్లో ప‌డ్డారు. ఇంకేం త‌న‌లోని అద్భుత‌మైన న‌టుడిని గుర్తించారు. ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడ‌లేదు . ప్ర‌పంచంలో ఏ న‌టుడు న‌టించ‌న‌న్ని సినిమాల‌లో న‌టించారు. అన్ని వ‌ర్గాల వారిని న‌వ్వించారు. ఇంకా న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు.

తాజాగా వెంక‌ట్ సిద్దా రెడ్డి సార‌థ్యంలోని అన్విక్షి ప‌బ్లికేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో బ్ర‌హ్మానందం త‌న ఆత్మ క‌థ నేను అనే పేరుతో రాశారు. ఇది అమెజాన్ లో అత్య‌ధికంగా అమ్ముడు పోయిన పుస్త‌కంగా చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌చురించిన కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా కొనుగోలు చేశారు. రెండో ముద్ర‌ణ కూడా వ‌చ్చేసింది. ఈ సంద‌ర్బంగా త‌న చిత్రంతో త‌యారు చేసిన ఆర్ట్ ను మాజీ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఆవిష్క‌రించారు.