రేవంత్..బాబు భేటీ భేష్ – వెంకయ్య
ఇలాంటి వాతావరణమే కావాలి
అమరావతి – భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కావడాన్ని ఆయన స్వాగతించారు. ఇలాంటి ముందడగును తాను అభినందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలు వేరైనప్పటికీ తెలుగు వారంతా ఒక్కటేనని నిరూపించారని , ఇందుకు చంద్రబాబు తీసుకున్న చొరవను, రేవంత్ రెడ్డి స్నేహ పూర్వకంగా ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భేషజాలకు పోవడం వల్ల ఇబ్బందులు తప్ప సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.
చర్చల ద్వారానే, స్నేహ పూర్వకమైన వాతావరణంలో ఉంటే మరింత మేలు జరుగుతుందని నిన్న జరిగిన ఇద్దరు సీఎంల భేటీ తెలియ చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అడుగులు పడతాయని తాను ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.
పరస్పర గౌరవం , పరస్పర అవగాహనతో స్నేహ పూర్వకమైన నేపధ్యంలో నిర్వహించబడే ఈ సమావేశం, అంతర్-రాష్ట్ర సమస్యలకు పరిష్కారాలు ఎలా రూపొందించ బడతాయో ఒక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు.