అద్వానీ జీవితం స్పూర్తి దాయకం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
అమరావతి – దేశంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఉప ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నతమైన పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది.
ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు అభినందనలతో ముంచెత్తారు. శనివారం అద్వానీకి అవార్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు .
ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జీవితం ఆదర్శ ప్రాయంగా ఉంటుందన్నారు. తమందరికీ ఆయన గురువుగా పేర్కొన్నారు. తనకు మాట్లాడేందుకు మాటలు రావడం లేదని పేర్కొన్నారు. ఇవాళ ప్రభుత్వం తనకు రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించడం మరింత బాధ్యతను పెంచిందన్నారు.
ఇదే సమయంలో ఈ ఏడాది ఇద్దరు గొప్ప వ్యక్తులకు భారత రత్న ప్రకటించడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఒకరు బీహార్ కు చెందిన దివంగత ఠాకూర్ కు బతికి ఉన్న అద్వానీకి ఇవ్వడం సముచితమేనని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.