రథ యాత్రను మరిచి పోలేను
ముప్పవరపు వెంకయ్య నాయుడు
హైదరాబాద్ – మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన అరుదైన ఫోటోను పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు , అపారమైన అనుభవం కలిగిన లాల్ కృష్ణ అద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు .
ఈ సందర్బంగా ఆనాడు దేశ వ్యాప్తంగా చేపట్టిన రథ యాత్ర గురించి మరిన్ని విషయాలు తెలియ చేశారు. బహు భాషలలో మంచి పట్టు కలిగిన వెంకయ్య నాయుడు తన అనుభవాలను పంచుకున్నారు. ఏ రకంగా ఈ దేశంలో తాము ప్రయాణం చేశామో , ఎన్ని ఇబ్బందులు పడ్డామో వివరించారు.
ఇష్టపడి పని చేస్తే కష్టం అన్నది తెలియదని, ఇక విజయం దానంతట అదే వస్తుందన్న విషయం తనకు స్వతహాగా తెలిసొచ్చిందని పేర్కొన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. తన జీవితంలో గురువుగా భావించే ఎల్కే అద్వానీ ఇవాళ తనతో పాటు ఇక్కడ ఉండడం ఆనందంగా ఉందన్నారు.
రోజు రోజుకు రాజకీయాలలో విలువలు దిగజారుతున్నాయని వాటిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చాలా మంది బూతులు మాట్లాడుతున్నారని , అవి వాడకుండా ఉండాలంటే పోలింగ్ బూత్ లలో మీరు ఓటు ద్వారా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.