వాళ్లు నిజమైన భారత రత్నాలు
ప్రశంసించిన వెంకయ్య నాయుడు
అమరావతి – భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతం అంటూ కొనియాడారు. కేంద్ర సర్కార్ అత్యున్నతమైన, దేశం గర్వించ దగిన, ప్రథమ పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది.
దేశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా , అభివృద్ది పథంలో తీసుకు వెళ్లేందుకు కృషి చేసిన ముగ్గురు గొప్ప వ్యక్తులను ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్ , పాములపర్తి వెంకట నరసింహారావు, హరిత విప్లవానికి ఆద్యుడైన ఎంఎస్ స్వామినాథన్ లకు భారత రత్న ప్రకటించడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు వెంకయ్య నాయుడు.
ఈ ముగ్గురు మహానుభావులు అని కొనియాడారు. వారు మరణాంతరం భారతరత్నం ప్రకటించడం ఒకింత బాధగానే ఉన్నా అద్భుతమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఈ మట్టిని ప్రేమించడమే కాదు చివరి వరకు రైతుల కోసం పోరాడిన యోధుడు చరణ్ సింగ్ అని కొనియాడారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న భారత దేశానికి ఆక్సిజన్ అందించిన నేత పీవీ అని పేర్కొన్నారు. ఇక ఆకలితో ఎవరూ ఉండ కూడదని హరిత విప్లవానికి ఆద్యుడు స్వామినాథన్ అంటూ ప్రశంసించారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.