నేతలకు బూత్ లలో బుద్ది చెప్పండి
మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విశాఖపట్టణం – బూతులు మాట్లాడే రాజకీయ నాయకులకు పోలింగ్ బూత్ లలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ లలో కొంత మంది అపసవ్య పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. రాజకీయ నాయకులు స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడ కూడదని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు.
చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలని అన్నారు. మాతృ భాషను ఎవరూ మర్చి పోకూడదన్నారు. విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని పేర్కొన్నారు.
నేడు విలువలతో కూడిన విద్య తగ్గుతోందని..ఇది మంచిది కాదన్నారు వెంకయ్య నాయుడు. విలువలతో కూడిన విద్య ను అందించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మరల ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందన్నారు.
దేశ వారసత్వాన్ని కాపాడు కోవాల్సిన ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వెంకయ్య నాయుడు. గూగుల్ గురువుని మించింది కాదన్నారు.