ENTERTAINMENT

అక్టోబ‌ర్ 10న రానున్న వేట్టైయాన్

Share it with your family & friends

ర‌జ‌నీకాంత్..మంజు వారియ‌ర్

త‌మిళ‌నాడు – లోకేష్ క‌న‌గ‌రాజ్ త‌ర్వాత టీజె జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న వేట్టైయాన్ చిత్రంపై భారీ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. దీనికి క‌ర్త‌, క‌ర్మ‌, రాత‌, గీత టిజె జ్ఞాన‌వేల్ కూ. సుభాస్క‌ర‌న్ అల్లిరాజా వేట్టైయాన్ చిత్రాన్ని తీశాడు.

ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టిస్తుండ‌డం విశేషం. వేట్టైయాన్ చిత్రంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో పాటు అందాల ముద్దుగుమ్మ మంజు వారియ‌ర్ జంట‌గా న‌టిస్తున్నారు. వీరితో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుద‌ల చేసిన మ‌న‌సాలియో పాట దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్ ఆర్ క‌తీర్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌గా ఫిలోమిన్ రాజ్ కూర్పు చేకూర్చారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ వేట్టైయాన్ ను పంపిణీదారుగా ఉన్నారు.

ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు తేదీని ఖ‌రారు చేశారు. వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా వేట్లైయాన్ ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ సినిమాను రూ. 160 కోట్లతో ఖ‌ర్చు చేసి తీసుకు రానున్నారు.