NEWSNATIONAL

వీహెచ్‌పీ స్వ‌రం ఓట్ల‌ జ‌పం

Share it with your family & friends

హిందువుల కోసం ఓటేయండి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ – విశ్వ హిందూ ప‌రిష‌త్ నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నికైన అలోక్ కుమార్ జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొద‌టి నుంచి హిందూ జ‌పం చేస్తున్న వీహెచ్ పీ మ‌రోసారి త‌న నైజాన్ని బ‌య‌ట పెట్టుకుంది. భార‌త రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా కేవ‌లం హిందువులు మాత్ర‌మే ఓటు వేయాల‌ని వీహ‌చ్పీ చీఫ్ కోర‌డం విస్తు పోయేలా చేసింది.

లోక్‌సభ ఎన్నికల్లో హిందువుల కోసం మాట్లాడే వారికి ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు అలోక్ కుమార్. హిందువులు, దేశం కోసం మాట్లాడే అభ్యర్థులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కోరారు. సెయింట్ శిరోమణి రవి దాస్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు అలోక్ కుమార్ .

ఈ కార్యక్రమానికి హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు. ఇవాళ నేను వీహెచ్‌పీ మేనేజింగ్‌ కమిటీ సమావేశానికి ఢిల్లీ నుంచి అయోధ్యకు వచ్చాను. రామ్‌లల్లా దర్శనానికి ముందు సన్యాసి శిరోమణి రవిదాస్‌కు పాదాభివందనం చేసేందుకు ఇక్కడికి వచ్చాను. మొఘలులు పరిపాలించినప్పుడు అది సాధువు అని గుర్తుంచుకోవాలన్నారు. హిందూ మతంపై దాడులను వ్యతిరేకించిన గొప్ప యోధుడు శిరోమణి రవిదాస్ అని కొనియాడారు.