NEWSANDHRA PRADESH

బాబు గెలిస్తే ఏపీ విధ్వంసమే

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి గ‌నుక ఖ‌ర్మ కాలి అధికారంలోకి వ‌స్తే ఇక దోపిడీకి , విధ్వంసానికి దారులు తెరుస్తారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వైసీపీ నెల్లూరు లోక్ స‌భ స్థానం అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు అమాయ‌కుడు కాడ‌ని, మాయ‌లోడ‌ని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేయ‌గ‌లిగే స‌త్తా క‌లిగిన ఏకైక ద‌గాకోరు నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే అది ఒక్క బాబేనంటూ మండిప‌డ్డారు.

చిల్ల‌ర రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని ఆరోపించారు. మోస పూరిత‌మైన హామీల‌తో జ‌నాన్ని మోసం చేసేందుకు ప్లాన్ చేశాడ‌ని, ప‌దే ప‌దే జ‌గ‌న్ రెడ్డిపై నోరు పారేసు కోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు విజ‌య సాయి రెడ్డి.

ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాల‌లో గ‌నుక టీడీపీ కూట‌మి ఒక్క సీటు గెలిచినా చంద్ర‌బాబు రౌడీ మూక‌లు చెల‌రేగి పోతాయ‌ని హెచ్చ‌రించారు. అందుకే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు ఎంపీ అభ్య‌ర్థి.

పేదల నోటికాడి ముద్దను లాక్కోవడం నుంచి వారికి వచ్చే సంక్షేమ పథకాల నిధులను నిలిపి వేయిస్తారని ఆరోపించారు.. ఇప్పటికే పేద ముస్లింల 4 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని కూటమి నేతలు బాహాటంగానే ప్రకటించారని గుర్తు చేశారు.