NEWSANDHRA PRADESH

న‌వ ర‌త్నాలు గెలిపిస్తాయి

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఏపీలో అమ‌లు చేస్తున్న న‌వ ర‌త్నాలు త‌మ‌ను మ‌రోసారి అధికారంలోకి తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా భారీ ఎత్తున వైసీపీలో చేర‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను కోరుకుంటార‌ని, స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం కావాల‌ని అనుకుంటార‌ని ఆ రెండు త‌మ పార్టీతో సాకారం కావ‌డం ఖాయ‌మ‌న్నారు ఎంపీ.

ఇదిలా ఉండ‌గా జ‌నసేన పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కార్య‌ద‌ర్శి ప్ర‌వీణ్ , బీజేపీ , జ‌న‌సేన జిల్లా కో ఆర్డినేట‌ర్ శ్రీ‌కాంత్ త‌మ అనుచ‌రుల‌తో వైసీపీలో చేరారు. వారికి కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు విజ‌య సాయి రెడ్డి.

టీడీపీ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని, ఇక వారంతా ఇంటికి వెళ్లేందుకు త‌ట్టా బుట్టా స‌ర్దు కోవాల‌ని ఎద్దేవా చేశారు ఎంపీ. ఇక‌నైనా ఆరోప‌ణ‌లు మానేయాల‌ని, మోసపు హామీల‌కు తెర దించాల‌ని సూచించారు. లేక‌పోతే ప్ర‌జ‌లు ఛీ కొట్టే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌న్నారు.