NEWSANDHRA PRADESH

బీజేపీని బీటీమ్ గా మార్చిన బాబు

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్

నెల్లూరు జిల్లా – వైసీపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. రాష్ట్రంలో బీజేపీని టీడీపీకి బీ టీమ్ గా మార్చేసిన ఘ‌న‌త త‌న‌దేన‌ని మండిప‌డ్డారు.

పొత్తులో పెట్టుకునేలా చేసి, దానిని నామ రూపాలు లేకుండా చేయాల‌ని చూశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ , 6 లోక్ స‌భ స్థానాల‌లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసింది కూడా చంద్ర‌బాబు నాయుడేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కమలం పార్టీకి గుర్తింపు తెచ్చిన కాపు నాయకుడు సోము వీర్రాజును తొలగించి తన వదిన పురంధేశ్వరికి పగ్గాలు దొరికేలా చక్రం తిప్పిందీ కూడా చంద్ర‌బాబేన‌ని ఫైర్ అయ్యారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ఆ పార్టీని తన గుప్పిట్లో పెట్టకుని టీడీపీకి బి-టీమ్‌గా మార్చాడంటూ ఫైర్ అయ్యారు.

ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క కా, పుబలిజకు సీటు దక్కకుండా చేసిన పాపం ఆయనదేన‌ని పేర్కొన్నారు. రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసి ఆ సామాజిక వర్గంపై తన అక్కసును బయట పెట్టుకున్నాడని ఆరోపించారు.