పరామర్శించిన పీఎం నరేంద్ర మోదీ
ఢిల్లీ – భారత దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ఆస్పత్రి పాలయ్యారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో హుటా హుటిన ఎయిమ్స్ కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జగదీప్ ధన్ ఖర్ వయసు 73 ఏళ్లు. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం పరిశీలన కొనసాగుతోందన్నారు. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్‌ఖర్‌ను క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చేర్చారు.
ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు పీఎం మోదీ. ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సైతం ఆస్పత్రికి వెళ్లారు. ఎయిమ్స్ అధికారులు ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రికి వివరించారు. మెరుగైన వైద్య సౌకర్యం అందజేయాలని ఆదేశించారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా జగ్‌దీప్ ధంఖర్ ప్రస్తుతం భారతదేశ ఉపరాష్ట్రపతిగా పని చేస్తున్నారు. ఆగస్టు 11, 2022న 14వ ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జూలై 18, 1951న రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న కాలిబంగాలో జన్మించిన ఆయన భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధంగా ఉన్నారు.
ఉపరాష్ట్రపతి కావడానికి ముందు, ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిని నిర్వహించారు. ధంఖర్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన విద్యను పూర్తి చేసి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనుభవజ్ఞుడైన న్యాయవాది. అంకితభావంతో కూడిన సామాజిక కార్యకర్త, ఆయన అనేక సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు.