బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా భూ కబ్జా
రోడ్డెక్కిన బాధితులు సంచలన ఆరోపణ
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ రంగనాథ్ దెబ్బకు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే 18కి పైగా భవనాలను కూల్చి వేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పూర్తి నివేదిక అందజేసినట్లు కమిషనర్ తెలిపారు.
అయితే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా సరే, తమ పార్టీకి చెందిన వారున్నా ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది.
ఇందులో భాగంగా అనురాగ్ విద్యా సంస్థల చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మించాడని ఆరోపించింది హైడ్రా. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై కూడా ఫోకస్ పెట్టింది.
దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంత కాలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అడ్డగోలు దందాను హైడ్రా బట్టబయలు చేసింది. తమ భూమిని పల్లా , ఆయన అనుచరులు కబ్జా చేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. ఆందోళన చేపట్టారు.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం వెంకటాపూర్ పరిధిలోని సర్వే నం.796 లోని తమ నాలుగు ఎకరాల భూమిని పల్లా, ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద బాధితులు ఆందోళణ చేపట్టారు.