జగన్ మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా విచారించింది.
HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్ పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది. టికెట్ల కోసం ఎస్ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు వెల్లడైంది. పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్న ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం . మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చారు కార్యదర్శి.
ఫ్రీగా 10 శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్మోహన్ రావు. HCA ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంటామని స్పష్టం చేసింది ఎస్ఆర్‌హెచ్. తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది యాజమాన్యం. SRH టికెట్లు ఇవ్వక పోవడంతో మ్యాచ్ ల సందర్భంగా ఇబ్బందులకు గురిచేసిన జగన్మోహన్ రావు.
లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు తాళాలు వేసిన హెచ్‌సీఏ సిబ్బంది .ఎస్‌ఆర్‌హెచ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా విజిలెన్స్ నివేదికలో వెల్లడైంది. దీని కారణంగా హెచ్‌సీఏ పై చర్యలకు విజిలెన్స్ సిఫారసులు చేసింది.