వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి లుక్ అవుట్ నోటీసులు
పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉమా మహేశ్వర శాస్త్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. భూకబ్జా, సుపారీ హత్యాయత్నం కేసులో ఇప్పటికే 9 మంది అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు గౌతమ్ రెడ్డి. ఆయనను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఇంకా దొరకక పోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఆయన వైసీపీలో కీలకమైన ముఖ్యమైన నేతగా ఎదిగారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో కీలకమైన సంస్థకు చైర్మన్ గా నియమించింది.
రాష్ట్రంలో ముఖ్యమైన కార్పొరేషన్ గా గుర్తింపు పొందిన ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు జగన్ రెడ్డి. తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అధికారాన్ని కోల్పోయింది. దీంతో వైసీపీ నేతలను టార్గెట్ గా కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది.
దీంతో పలువురు సీనియర్ వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తోంది.