NEWSANDHRA PRADESH

వైసీపీ విజ‌యానికి ఢోకా లేదు

Share it with your family & friends

ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి

అమ‌రావ‌తి – వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ త‌మ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఆదివారం నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణులు మన పార్టీకి ఓట్లు వేశారని చెప్పారు విజ‌య సాయి రెడ్డి.. రామ్మూర్తి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ‌ ఎన్నికల ఏజెంట్లతో స‌మావేశం ఏర్పాటు చేశారు.

కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన తీరుపై జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులుతో కలిసి సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌న్నారు.‌ కౌంటింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని వారికి దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు విజ‌య సాయి రెడ్డి.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. త‌మ పార్టీకి అత్య‌ధిక స్థానాలు గెల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.