NEWSANDHRA PRADESH

సూప‌ర్ సిక్స్ అంటే ఎవ‌రు బాబూ

Share it with your family & friends

నిప్పులు చెరిగిన విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – వైసీపీ సిట్టింగ్ ఎంపీ విజ‌య సాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌లా తోకా లేకుండా ఇంకా ఎన్నిక‌లు కాక ముందే అధికారంలోకి వ‌చ్చిన‌ట్లు తెగ ముచ్చ‌ట ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు విజ‌య సాయి రెడ్డి. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఇలాగే సంబుర ప‌డ్డార‌ని కానీ తీరా జ‌గ‌న్ రెడ్డి కొట్టిన దెబ్బ‌కు బెంబేలెత్తి పోయార‌ని అన్నారు.

ప్ర‌జా గ‌ళం పేరుతో టీడీపీ చేస్తున్న హై డ్రామాను చూసి జ‌నం న‌వ్వుకుంటున్నార‌ని పేర్కొన్నారు. ఇక‌నైనా అబ‌ద్దాలు, ఫేక్ ప్రచారాన్ని క‌ట్ట బెడితే బావుంటుంద‌ని సూచించారు. ఇక చంద్ర‌బాబు నాయుడు ఈ మ‌ధ్య ఎక్క‌డికి వెళ్లినా సూప‌ర్ సిక్స్ అంటున్నార‌ని మండిప‌డ్డారు.

సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావని, పొరపాటున గెలిస్తే తాను, తన పుత్రరత్నం లోకేశ్, వదిన పురంధేశ్వరి, యనమల రామకృష్ణుడు, పొంగూరు నారాయణ, నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్‌లు చక్రం తిప్పుతారని సంకేతం ఇస్తున్నారని ఆరోపించారు. వీళ్లు ఆరుగురు బాగు పడితే చాలనేది బాబు గారి కోరికంటూ ఎద్దేవా చేశారు.