ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్స్
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రధానంగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై నిప్పులు చెరిగారు. ఆమె భారతీయ జనతా పార్టీ కోసం పని చేయడం లేదని ఆరోపించారు.
పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె ఆత్మ , మనసు, తనువు అంతా తెలుగుదేశం పార్టీలో ఉందన్నారు. బీజేపీకి ద్రోహం చేస్తోందని , ఇది నీకు న్యాయమా అని ప్రశ్నిస్తున్నానని అన్నారు విజయ సాయి రెడ్డి.
ఆమె చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతోందని పేర్కొన్నారు. కేవలం భౌతికంగా బీజేపీలో ఉందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూటమికి అంత సీన్ లేదన్నారు. ఈ టీమ్ ను ఎవరూ నమ్మడం లేదన్నారు.
చంద్రబాబు నాయుడు ప్లాన్ లో భాగంగానే చాలా మంది టీడీపీకి చెందిన నేతలు బీజేపీలో ఉన్నారని , ఇదంతా గేమ్ లో భాగమేనని ఆరోపించారు. పురందేశ్వరి అందులో భాగంగానే చక్రం తిప్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఆమెను, పార్టీని, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు.