కుట్రలకు కేరాఫ్ చంద్రబాబు
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – కుట్రలు, కుతంత్రాలకు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కేరాఫ్ గా మారాడని నిప్పులు చెరిగారు నెల్లూరు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓడి పోతామోనని కుట్రలకు తెర లేపాడంటూ ధ్వజమెత్తారు.
వేమిరెడ్డి దంపతులతో కలిసి చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు ఎదుర్కొనేందుకు నెల్లూరు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆరోపించారు విజయ సాయిరెడ్డి. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని పేర్కొన్నారు.
ఈ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సంక్షేమ పథకాలు , ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఓటమి మాత్రమేనని పేర్కొన్నారు.
చంద్రబాబుకు అధికార యావ తప్ప ప్రజల బాగోగులు పట్టవన్నారు. ఎంత సేపు తను, తన ఆస్తులు, తన వారికి చెందిన వారికి ఎలా పనులు అప్పగించాలనే దానిపైనే ఫోకస్ ఉంటుందన్నారు విజయ సాయి రెడ్డి.