నేను మారలేదు నువ్వే మారిపోయావు
అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి. తాను మారలేదని, నువ్వే మారి పోయావంటూ ఎద్దేవా చేశారు. తన వ్యక్తిత్వం అలాగే ఉంటుందన్నారు. ఎవరు ఎవరికి లొంగి పోయారో ప్రజలకు బాగా తెలుసన్నారు. తాను ఎవరి వల్ల మీ నుంచి దూరమయ్యానో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఆరు నూరైనా సరే తాను ఎప్పటికీ మారబోనని, ఇలాగే ఉంటానని స్పష్టం చేశారు. నువ్వే పదవి వచ్చాక పూర్తిగా మారి పోయావంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో తనకు ఎనలేని, విడదీయలేని అనుబంధం ఉందన్నారు విజయ సాయి రెడ్డి. పెళ్ళి చేసుకున్న వారే విడి పోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముందంటూ నిలదీశారు. ప్రలోభాలకు లొంగి పోయే వాడిని కానన్నారు. ఎవ్వరికీ తాను భయపడనని, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదన్నారు.మద్యం కేసు సిట్ చూస్తోందన్నారు. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సంచలన కామెంట్స్ చేశారు. భవిష్యత్ లో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమోనని అన్నారు.