మోదీ నాయకత్వం అవసరం
బీజేపీ నేత విజయ ధరణి
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ విజయ ధరణి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె కీలకంగా మారారు. పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరునల్వేలి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబసముద్రం లో జరిగిన బహిరంగ సభలో హాజరయ్యారు.
ఈ సందర్బంగా ప్రత్యేకంగా ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎలా పార్టీ ముందుకు వెళుతుందనే దానిపై ఆరా తీశారు పీఎం. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మంచి పదవి తనకు దక్కుతుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఒక డాక్టర్ గా , సామాజిక సేవకురాలిగా, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఇప్పటికే గుర్తింపు పొందారు విజయ ధరణి. ఆమె నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వారి తరపున తను గొంతుకగా ఉన్నారు. ఈ తరుణంలో ఎలాగైనా సరే బీజేపీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి సారథ్యంలో మరింత ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.