NEWSANDHRA PRADESH

ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు తావులేదు

Share it with your family & friends

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – విజ‌య‌వాడ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి జ‌ర‌గ‌డం దారుణ‌మ‌న్నారు వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ మాట్లాడే స్వేచ్ఛ‌, హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అలాగ‌ని దాడుల‌కు దిగ‌డం ఎంత మాత్రం స‌మాజానికి, ప్ర‌జాస్వామ్యానికి క్షేమ‌క‌రం కాద‌ని పేర్కొన్నారు విజ‌య సాయిరెడ్డి.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేని వారే ఇలాంటి చ‌వ‌క‌బారు చేష్ట‌ల‌కు దిగుతున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న‌ను ధైర్యంగా ఎదుర్కోలేని వాళ్లే ఇలాంటి దాడుల‌కు పాల్ప‌డి ఉంటార‌నే అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు ఎంపీ.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడ‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయ‌న ఏనాడూ అభివృద్దిని న‌మ్ముకుని రాజ‌కీయాలు చేయ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేవ‌లం హింస‌, కుట్ర‌ల‌ను మాత్ర‌మే న‌మ్ముకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు విజయ సాయి రెడ్డి. పిరికిపంద రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని మ‌రోసారి నిరూప‌ణ అయ్యిందంటూ ఫైర్ అయ్యారు ఎంపీ.