గెలిపిస్తే సోమశిల పనులు పూర్తి చేస్తా
మళ్లీ వస్తానన్న ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – తనను మరోసారి ఆదరించి గెలిపిస్తే నెల్లూరు జిల్లాను దేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా చేస్తానని ప్రకటించారు ఎంపీ విజయ సాయి రెడ్డి. శనివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే ప్రాణ ప్రదాయిని సోమశిల హైలెవె కెనాల్ మొదటి దశను రూ. 853 కోట్ల ఖర్చు తో , రెండో దశ కింద రూ. 648 కోట్ల వ్యయంతో రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయిస్తానని ప్రకటించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడినని స్పష్టం చేశారు.
గతంలో తాము ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశామని స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. అయితే సోమశిల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి దశ పనులు ఇప్పటికే 80 శాతానికి పగైఆ పూర్తయినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ ఒక్క కెనాల్ గనుక పూర్తయితే నెల్లూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం అవుతాయని చెప్పారు ఎంపీ విజయ సాయి రెడ్డి.