కోట్లు వెదజల్లినా కూటమి గెలవదు
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
నెల్లూరు జిల్లా – ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో వైసీపీని ఢీకొనే సత్తా కూటమికి లేదన్నారు.
చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి తలకిందులుగా తపస్సు చేసినా, వేల కోట్ల రూపాయలు వెదజల్లినా టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆఖరి అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారని , కానీ అది కూడా వర్కవుట్ కాలేదన్నారు.
జగన్ మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులకు పాల్పడినా తాము వెనుదిరిగే ప్రసక్తి లేదని హెచ్చరించారు. జగన్ ను ఈ లోకం నుంచే లేకుండా చేయాలని కుట్రకు చంద్రబాబు తెర తీశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆరు నూరైనా సరే ఏపీలో మళ్లీ జెండా ఎగుర వేసేది వైసీపీనేనని స్పష్టం చేశారు .