నీట్ ఎగ్జామ్ స్కామ్ పై మౌనమేల..?
వైసీసీ సీనియర్ నేత విజయ సాయి రెడ్డి
అమరావతి – దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ ఎగ్జామ్ 2024 లో భారీ ఎత్తున స్కామ్ చోటు చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారికే ఎక్కువగా ర్యాంకులు వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి.
తాము కష్ట పడినా ర్యాంకులు రాలేదంటూ లక్షలాది మంది విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. విద్యార్థుల తరపున తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్ లో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీయాలని, తమకు న్యాయం చేయాలని, విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తాజాగా నీట్ ఎగ్జామ్ పై స్పందించారు విజయ సాయి రెడ్డి. ఈ ప్రధాన అంశంపై రాజకీయ పార్టీలు మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు. నీట్ ఎగ్జామ్ కు 60 వేల మంది, దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరైనా ఇప్పటి వరకు మోడీ స్పందించడం లేదు.