నెల్లూరు బియ్యానికి పూర్వ వైభవం
తీసుకు వస్తామన్న విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ సిట్టింగ్ ఎంపీ విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గతంలో నెల్లూరు బియ్యానికి మంచి పేరు ఉండేదని గుర్తు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
బియ్యం ఉత్పత్తి చేయడంలో నెల్లూరు ప్రాంతం నెంబర్ వన్ గా ఉండేదన్నారు విజయ సాయి రెడ్డి. ఇక్కడ పండించే సన్నాలు, మొల కొలకులు, చిట్టి ముత్యాల వంటి బియ్యం అంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమని తెలిపారు.
ఆ మూడు రాష్ట్రాలకు నెల్లూరు నుండే ఎగుమతి అయ్యేదని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి. తెలుగుదేశం సాగించిన 21 ఏళ్ల పాలనలో నెల్లూరు బియ్యానికి ఉన్న ఖ్యాతి పూర్తిగా చెదిరి పోయిందన్నారు.
కరువుకు మారు పేరు అయిన చంద్రబాబు నాయుడు పాలనలో నెల్లూరు సన్నాలు పూర్వ వైభవ్యాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఆద్వర్యంలో సర్కార్ వస్తే తిరిగి ఈ ప్రాంతపు బియ్యానికి పూర్వ వైభవం తీసుకు వస్తామన్నారు విజయ సాయి రెడ్డి.