NEWSANDHRA PRADESH

ఉప రాష్ట్ర‌ప‌తితో విజ‌య సాయి రెడ్డి భేటీ

Share it with your family & friends

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశాన‌న్న ఎంపీ

ఢిల్లీ – వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి సోమ‌వారం భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు ఎంపీ.

అపార‌మైన అనుభ‌వం, తెలివి తేట‌ల‌తో పాటు నిబ‌ద్ధ‌త క‌లిగిన వ్య‌క్తి ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ అని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి. రాజ్య‌స‌భ‌ను న‌డిపించ‌డంలో కీల‌క‌మైన భూమిక పోషిస్తున్నార‌ని తెలిపారు.

ఆయ‌న పెద్ద‌ల స‌భ‌కు త‌న ప‌నితీరుతో వ‌న్నె తెచ్చారంటూ కొనియాడారు వైసీపీ ఎంపీ. ఈ సంద‌ర్బంగా త‌న‌కు రాజ్య‌స‌భ‌లో మాట్లాడేందుకు అవ‌కాశం ఇస్తూ మ‌రింత‌గా ప్రోత్స‌హిస్తున్నార‌ని, అందుకు ఉప రాష్ట్ర‌ప‌తికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాని స్ప‌ష్టం చేశారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.

ప్యానల్ లో కూడా త‌న‌ను చేర్చ‌డంలో జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ పాత్ర ఎంతో ఉంద‌ని అన్నారు. ఇవాళ ఆయ‌న‌ను క‌లుసు కోవ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగించిందని, ప్ర‌త్యేకించి వివిధ రంగాల‌కు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం త‌న‌ను విస్మ‌యానికి గురి చేసింద‌న్నారు వైసీపీ ఎంపీ.