విజయ సాయి రెడ్డీ నామినేషన్
మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తారు
నెల్లూరు జిల్లా – వైసీపీ నెల్లూరు లోకసభ స్థానానికి అభ్యర్థిగా మంగళవారం విజయ సాయి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట భార్య, కూతురు ఉన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం కేవలం దరఖాస్తు సమర్పించే సమయంలో కేవలం 5 గురు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే విజయ సాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తను ప్రత్యక్షంగా బరిలోకి ఎంపీగా దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేయడం తను ఊహించ లేదన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు విజయ సాయి రెడ్డి.
ఇంతటి గొప్ప అవకాశం కల్పించినందుకు తాను జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్ని కుట్రలు పన్నినా వర్కవుట్ కాదన్నారు. తన గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు విజయ సాయి రెడ్డి.
లక్ష కు పైగా మెజారిటీ తో గెలుపొందుతానని, మరోసారి ప్రజలందరి తరపున గొంతు పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పారు.