ఉప రాష్ట్రపతి ఆమోదించారని ప్రకటన
ఢిల్లీ – వైఎస్సార్సీపీకి చెందిన విజయ సాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఆమోదం కూడా తెలిపారని వెల్లడించారు . పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. జగన్ రెడ్డితో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా అప్రూవర్ గా మారే ప్రసక్తి లేదన్నారు. వెన్ను పోటు రాజకీయాలు తనకు తెలియవని అన్నారు.
భవిష్యత్తులో రాజకీయాల గురించి మాట్లాడనంటూ స్పష్టం చేశారు. తనకు ఎవరి పట్ల కక్ష లేదన్నారు. ఎవరినీ విమర్శించిన దాఖలాలు లేవన్నారు. కావాలని తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. తన రాజీనామా విషయం గురించి పలుమార్లు తమ పార్టీ బాస్ తో చర్చించడం జరిగిందని చెప్పారు విజయ సాయి రెడ్డి.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు దేవుడి మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. కానీ ఎవరికీ ఇప్పటి వరకు నమ్మక ద్రోహం చేయలదేన్నారు ఎంపీ. తన లాంటి వాళ్లు ఎంత మంది పార్టీని విడిచి వెళ్లినా జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ తగ్గదన్నారు.