NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ల‌క్ష్యం జ‌న సంక్షేమం

Share it with your family & friends

మా నాయ‌కుడు ద‌మ్మున్నోడు
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మ పార్టీ చీఫ్, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌మ నాయ‌కుడు మాట‌లు చెప్ప‌ర‌ని, ఆచ‌ర‌ణ‌లో చేసి చూపిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

జ‌గ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌మైన మ‌న‌స్త‌త్వ‌మ‌ని, ఆయ‌న అనుకుంటే ఒక‌సారి ఇక వెనుదిరిగి చూడ‌ర‌ని అన్నారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు విజ‌య సాయి రెడ్డి. సీఎం సంక్షేమ ప‌థ‌కాలు రూపొందించ‌ర‌ని, కానీ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను సృష్టిస్తార‌ని స్ప‌ష్టం చేశారు .

ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ఏపీలో అత్యుత్త‌మ‌మైన విద్య‌, ఆరోగ్య సంర‌క్ష‌ణ , సంక్షేమ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను క‌లిగి ఉంద‌న్నారు. ఇంత‌కంటే ఇంకేం కావాల‌ని ప్ర‌శ్నించారు విజ‌య సాయి రెడ్డి. మా ల‌క్ష్యం ఒక్క‌టే కాలుష్యం లేని ఏపీని త‌యారు చేయ‌డ‌మ‌ని పేర్కొన్నారు .

రాబోయే కాలంలో విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, నైపుణ్యాభివృద్దిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య సాయి రెడ్డి. చంద్ర‌బాబు నాయుడుకు అంత సీన్ లేద‌న్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ. త‌ను బాల్య స్నేహితుడ‌ని తెలిపారు.