NEWSANDHRA PRADESH

ఏపీలో కూట‌మి చాప్ట‌ర్ క్లోజ్

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి

నెల్లూరు జిల్లా – ఏపీలో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్, శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ ,జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు నెల్లూరు సిట్టింగ్ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అబ‌ద్దాల‌కు కేరాఫ్ చంద్ర‌బాబు అని ఆయ‌న‌ను జ‌నం న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఉన్నా లేన‌ట్టేనంటూ ఎద్దేవా చేశారు.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. కార‌ణం ఆయ‌న సినిమాల‌లోనే కాదు రాజ‌కీయాల‌లో కూడా అద్భుతంగా న‌టిస్తున్నాడ‌ని ఈ విష‌యం ఇటీవ‌లే త‌మ పార్టీలో చేరిన పోతిన మ‌హేష్ ఉద‌హ‌రించాడ‌ని గుర్తు చేశారు విజ‌య సాయి రెడ్డి.

ఆరు నూరైనా స‌రే తాము ఈసారి ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డం ప‌క్కా అని పేర్కొన్నారు. వై నాట్ 175 అన్న‌ది త‌మ నినాద‌మ‌ని, ఎన్నిక‌ల‌య్యాక తేలి పోతుంద‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, పురందేశ్వ‌రి ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఎద్దేవా చేశారు.

జ‌నం సంక్షేమం, అభివృద్దికి ఓటు వేస్తారు త‌ప్పా మాయ మాట‌ల‌తో ప్ర‌జ‌లను మోసం చేసే కూట‌మిని ఎంచుకోర‌ని స్ప‌ష్టం చేశారు వైసీపీ ఎంపీ. ఇక‌నైనా మీ విలువైన ఓటును త‌మ‌కు వేయాల‌ని కోరారు.