Saturday, April 5, 2025

కోటరీ వల్లే జగన్కు దురమయ్యా
మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కోట‌రీ వ‌ల్ల‌నే తాను జ‌గ‌న్ నుంచి దూర‌మ‌య్యాన‌ని అన్నారు. మీ మనసులో నాకు స్థానం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నానని చెప్పానని స్ప‌ష్టం చేశారు. మీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు వినొద్దని జగన్కు చెప్పాన‌ని తెలిపారు. నా మనసు విరిగి పోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చాన‌ని అన్నారు. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదని, తాను తిరిగి వైసీపీలో చేరే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారు. కానీ మ‌న‌సు ఒప్ప‌డం లేద‌న్నారు.

జ‌గ‌న్ కు ఈ కేసుతో ప్ర‌మేయం లేద‌న్నారు. తాను ప్ర‌లోభాల‌కు లొంగి పోయాన‌ని మా నేత అన‌డం బాధ క‌లిగించింద‌న్నారు విజ‌య సాయి రెడ్డి. కేవీ రావుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పానన్నారు. కేవీరావుతో ముఖప రిచయం తప్ప ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవన్నారు. అరబిందో వ్యాపారాల్లోనూ నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్ప‌ష్టం చేశారు. విక్రాంత్‌రెడ్డి తెలుసా అని అడిగారు. సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసు అని చెప్పానని అన్నారు. నేను విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకు పరిచయం చేయాల్సిన అవసరం లేద‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments