NEWSANDHRA PRADESH

అచ్చెన్నాయుడు కామెంట్స్ ఎంపీ సీరియ‌స్

Share it with your family & friends

మ‌నిషి పెరిగినా బుద్ది పెర‌గ‌లేదంటూ ఆగ్ర‌హం

అమ‌రావ‌తి – వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి సీరియ‌స్ అయ్యారు. త‌న‌పై అనుచిత కామెంట్స్ చేసిన ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై నిప్పులు చెరిగారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్ర‌య‌త్నం చేశానంటూ వ్యాఖ్యానించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

తాను ఎవ‌రితోనైనా మాట్లాడిన‌ట్లు కానీ నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం తెలుగుదేశం పార్టీకి, నేత‌ల‌కు , మంత్రులకు అల‌వాటుగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు విజ‌య సాయి రెడ్డి. అచ్చెన్నాయుడు తాటి చెట్టు లాగా పొడువుగా పెరిగాడ‌ని, కానీ బుద్ది మాత్రం పెర‌గ‌లేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఎంపీ.

గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతంమాత్రమే ఇచ్చాడాయె! చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్. అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించేవారట కదా!

దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల మీ చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయి. మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటావు. నా విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై జోకులు పేలుస్తున్నావు.

విజయసాయిరెడ్డి అనే నేను టీడీపీ అనే కులపార్టీ లో చేరేందుకు ప్రయత్నించానా? అచ్చెన్నా… నువ్వు ఎంత గట్టిగా అనుకున్నా ఈ జన్మకి నీ కోరిక తీరదయ్యా! భ్రమల లోకంలో గెంతులు వేయాలనుకుంటే, గో…ఆన్…నిన్ను ఆపేదెవరు.

జత ఎద్దులకుండే బలం ఉంది నీ ఒక్కడికి. మేథో శక్తికి, అడ్డం-నిలువుకు మధ్య ఉండే తేడా తెలియక పోవడం వల్లే మీతో ఈ సమస్యంతా అని ఎద్దేవా చేశారు.