చంద్రబాబు అబద్దాల పుట్ట
ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అబద్దాల పుట్ట అంటూ మండిపడ్డారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించి ప్రసంగించారు.
టీడీపీ చీఫ్ నిత్యం అబద్దాలు ఆడటంలో ఆరి తేరాడని ఆరోపించారు. ఆయనను మించిన అబద్దాల కోరు ఎవరూ లేరన్నారు. ఆయన లాగా మోసం చేయడం తెలియదన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత దాకా , ఎక్కడి వరకైనా వెళ్లే దమ్ము ఒక్క వైసీపీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ఘనత సీఎందేనని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి. అందుకే తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం కేంద్రంలో ఇవాళ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాలరెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావుతో కలిసి నిర్వహించిన బహిరంగ సభకు వచ్చిన ఆదరణ చూసి టీడీపీ వెన్నులో వణుకు మొదలయిందన్నారు. ప్రజల మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని మరోసారి రుజువు అయిందని స్పష్టం చేశారు ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి.