బాబు చెప్పేవన్నీ అబద్దాలే
ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు పనీ పాటా లేకుండా పోయిందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పితే ఏపీకి చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పటి వరకు లక్ష కోట్లకు పైగా ఏపీ నెత్తిన అప్పుల భారం మోపాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఖాళీ ఖజానా చేతికి ఇచ్చాడని ధ్వజమెత్తారు.
ప్రజల్లో తప్పుడు సమాచారం వెళ్లేలా ప్లాన్ చేశాడని, ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రభుత్వం భూములు లాక్కుంటుందని దుష్ప్రచారం చేశాడని ఆరోపించార విజయ సాయి రెడ్డి.
అయినా చంద్రబాబు మాటలను జనం నమ్మ లేదన్నారు. అది కేంద్రం చొరవతో ప్రవేశపెట్టిన చట్టం కావడంతో బీజేపీ కూడా ఖండించిందని స్పష్టం చేశారు. ఇక లాభం లేదు అనుకుని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్స్ కాపీలు ఇస్తున్నారని చంద్రబాబు పిడకలు విసిరాడని ఎద్దేవా చేశారు.
9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగితే తామందరికి స్టాంప్ పేపర్లే ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. దిక్కుతోచని బాబు ఇప్పుడు దాడులు, ఘర్షణలకు క్యాడర్‌ను ఉసిగొల్పుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.