NEWSANDHRA PRADESH

అబద్దాల‌కు కేరాఫ్ చంద్ర‌బాబు

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్

నెల్లూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి. అబ‌ద్దాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ ఎద్దేవా చేశారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య సాయి రెడ్డి ప్ర‌సంగించారు. టీడీపీ కూట‌మికి ప‌నీ పాటా లేద‌న్నారు. జ‌నం ఆ నేత‌ల‌ను న‌మ్మే స్థితి లో లేర‌న్నారు.

ఇంత కాలం రాజ‌కీయాల‌లో ఉన్నానంటూ ప్ర‌గ‌ల్బాలు ప‌లికే చంద్ర‌బాబు నాయుడు ఏపీకి ఏం చేశారో చెప్పాల‌న్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త ఆయ‌న‌కే ఉంద‌న్నారు. ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా, ఎంత‌గా ఫేక్ ప్ర‌చారం చేసినా ఓట్లు రాల‌వ‌న్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రు ఇంటికి వెళ‌తారో తేలి పోతుంద‌న్నారు విజ‌య సాయి రెడ్డి. ఇక మంత్రిగా నారాయ‌ణ ఏం చేశారో చెప్పాల‌న్నారు. గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన మీకు జ‌నం త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం త‌ప్ప‌ద‌న్నారు ఎంపీ.

నెల్లూరు జిల్లాకు ఏం చేశావంటూ త‌న‌ను ప్ర‌శ్నించే ముందు మీరు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.