కూటమి పనై పోయింది – ఎంపీ
విజయ సాయి రెడ్డి కామెంట్స్
నెల్లూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ కూటమి పనై పోయిందని ఎద్దేవా చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నెల్లూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏకి పారేస్తున్నారు. ఆయనకు అంత సీన్ లేదంటూ మండిపడ్డారు.
ఆచరణకు నోచుకోని హామీలతో గతంలో ఏపీని పాలించిన చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేశాడని ధ్వజమెత్తారు. ఆయన చేసిన నిర్వాకం కారణంగా ఇవాళ మోయలేనంత భారం తమ సర్కార్ పై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఎక్కడా అమలు జరగడం లేదని అన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ప్రజా గళానికి జనం దూరంగా ఉంటున్నారని, మరోసారి జగన్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్దమై ఉన్నారని చెప్పారు.
వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారో బాబు, పవన్, పురందేశ్వరి ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వీరిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.