NEWSANDHRA PRADESH

కుల అరాచ‌క శ‌క్తుల గురించే మాట్లాడా

Share it with your family & friends

మీడియాను దూషించ లేద‌న్న ఎంపీ

అమ‌రావ‌తి – రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తన‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

తాను ఏనాడూ మీడియాకు సంబంధించిన ప్ర‌తినిధుల‌ను దూషించ లేద‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య సాయి రెడ్డి. అయితే మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు.

త‌న‌ మాటలను తప్పుదారి పట్టించ వద్దని సూచించారు, అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినాల‌ని కోరారు. మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే తాను నేర్పించేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోవాల‌ని సూచించారు. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అని ప్ర‌శ్నించారు ఎంపీ విజ‌య సాయి రెడ్డి.