NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబు వ‌ల్ల‌నే నాపై కేసులు

Share it with your family & friends

ఎంపీ విజ‌య సాయి రెడ్డి కామెంట్

నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌పై కేసులు ఉన్నాయంటూ కామెంట్స్ చేసిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఏకి పారేశారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. ఆరు నూరైనా గెలిచేది త‌నేన‌ని, ఇక టీడీపీ కూట‌మికి ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్నారు విజ‌య సాయి రెడ్డి.

నాపై ఛార్జిషీట్ల గురించి మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఆ కేసులు ఎప్పుడు పెట్టారో తెలుసా అని నిల‌దీశారు. ఎవ‌రెవ‌రు క‌లిసి కుట్ర చేశార‌నేది మీకు తెలియ‌దా అని అన్నారు విజ‌య సాయి రెడ్డి.

రాజ్యసభ సభ్యుడిగా 6 ఏళ్లు మా పార్టీలో ఉన్నప్పుడు చార్జిషీట్ల గురించి మీకు గుర్తుకు రాలేదా? ఆ కేసుల వెనక వ్యవస్థల మేనేజ్మెంట్ నిపుణుడు చంద్రబాబు పాత్ర ఉందని లోకమంతా తెలుసన్నారు . ఆ కేసుల్లో ఎర్రన్నాయుడు ఇంప్లీడ్ అయింది బాబు చెబితేనే కదా అని నిల‌దీశారు.

చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మమ్మల్ని జైలుకు పంపించిన దగాకోరు మీ చంద్రబాబు కాదా? ప్రశాంతంగా కూర్చుని గతం గుర్తు చేసుకోండి అంటూ ఎద్దేవా చేశారు.