NEWSANDHRA PRADESH

వైఎస్ఆర్ బ‌తికి ఉన్న‌ప్పుడే ఆస్తుల పంప‌కాలు

Share it with your family & friends

ష‌ర్మిల కామెంట్స్ విజయ సాయి సీరియ‌స్
హైద‌రాబాద్ – వైసీపీ ఎంపీ, మాజీ ఆడిట‌ర్ విజ‌య సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. త‌న వ‌య‌సు
67 ఏళ్ళు అని తాను రాజారెడ్డి, వైస్ రాజశేఖర్ రెడ్డి , వైఎస్ జగన్ రెడ్డిలకు ఆడిటర్ గా ప‌ని చేశాన‌ని చెప్పారు.

దివంగ‌త వైఎస్సార్ బ్రతికున్నప్పుడే కూతురు కొడుకు కు ఆస్తుల పంపకాలు జరిగాయని చెప్పారు. షర్మిల ది ఆస్థి తగాదా కాదు అధికారం కోసం తగాదా ..మరల జగన్ సీఎం కాకూడదు అని షర్మిల కంక‌ణం క‌ట్టుకున్న‌ద‌ని ఆరోపించారు.

వైఎస్సార్ పై కేసులు పెట్టిన కాంగ్రెస్ , చంద్ర‌బాబు నాయుడుల‌తో క‌లిసి పోయిన చ‌రిత్ర నీద‌న్నారు. వైఎస్ చ‌ని పోయేందుకు 15 రోజుల ముందు ఈ భూమి మీద ఉండ‌డ‌ని బాబు అన‌లేదా…అది మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు విజ‌య సాయి రెడ్డి.

నువ్వు రాసిన లేఖ..నీవు ఇవ్వక పోతే బాబు కి, ఎల్లో మీడియా చేతికి ఎలా వచ్చిందని ప్ర‌శ్నించారు. 2019 లో జగన్ సీఎం అయ్యాక‌ చెల్లి మీద ప్రేమ్మతో “సొంతంగా సంపాదించిన” ఆస్తిలో కోర్ట్ కేసులు పూర్తి అయిన తర్వాత‌ 40 శాతం ఇస్తాను అని చెప్పి షర్మిల కు ఎంఓయు ఇవ్వడం జరిగిందన్నారు.

షేర్లు ఆస్తుల పంపకాలు కోర్ట్ కేసులు పూర్తి అయినాక మాత్రమే చేయాలి..లేకపోతె కోర్టు ఇబందులు వస్తాయి అని ఇద్దరు రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జీలు చెప్పారని గుర్తు చేశారు విజయ సాయి రెడ్డి. జగన్ కు తెలియకుండా దొంగ సంతకాలతో షేర్స్ బ‌దిలీ చేయించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మొదట్లో సాక్షికి ఏటా 20 కోట్ల నష్టం వ‌చ్చింద‌ని, భారతి సిమెంట్స్ కు 1400 కోట్లు అప్పు చేసి
తరువాత పెట్టుబడులు తీర్చారని చెప్పారు . ఎప్పుడైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టావా ష‌ర్మిలా అని నిల‌దీశారు. NCLT లో పిటీషన్ వేశారు కాబట్టి వచ్చే తీర్పును గౌరవిద్దామ‌ని అన్నారు

2009 నుంచి జగన్ ఎన్నికల అఫిడవిట్ లు చూస్తే ఆస్తుల పంపకం ఎలా జరిగాయో తెలుస్తుందన్నారు. జగతి పేరు నేనే సూచించా..ఎందుకంటే అది వాళ్ల కంపెనీ కాబట్టి . మీకు వివాహం అయి 25 ఏళ్ళు అయింది వైఎస్సార్ చనిపోయి 15 ఏళ్ళు అయింది. అయినా జగన్ 200 కోట్లు నీకు ఇచ్చాడు.. అది జగన్ అతి మంచి తనం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు విజ‌య సాయి రెడ్డి.