సివిల్స్ విజేతలకు ప్రశంసలు
ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – దేశ వ్యాప్తంగా అత్యున్నతమైన సర్వీసుగా భావించే యూపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు 2023 సంవత్సరానికి గాను నిర్వహించిన ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ర్యాంకులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యా రెడ్డి ఏకంగా దేశ వ్యాప్తంగా 3వ ర్యాంకు సాధించింది. ఇక కరీంనగర్ జిల్లాలోని మారుమూల పల్లె వెలిచాల గ్రామానికి చెందిన బీడీ కార్మికుడి కొడుకు నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించాడు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. సివిల్స్ లో సత్తా చాటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు సివిల్స్ లో దుమ్ము రేపారు. ఈ సందర్బంగా విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
సివిల్స్ లో ర్యాంకులు పొందిన ఏపీకి చెందిన భానుశ్రీ లక్ష్మీ, ప్రత్యూష, ప్రదీప్ రెడ్డి, కె. శ్రీనివాసులు, హరి ప్రసాద రాజు, నాగ భరత్ , పి. భార్గవ్ , హనితా వేములపాటి, గోవాడ నవ్యశ్రీ, భడా బాగిని, వినీషాలను ప్రత్యేకంగా అభినందించారు వైసీపీ ఎంపీ.