తండ్రీ కొడుకులు ఓర్చు కోలేరు – ఎంపీ
విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్
అమరావతి – వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తనయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. ఇతరుల విజయాలను చూసి తండ్రీ కొడుకులు ఓర్చు కోలేరంటూ మండిపడ్డారు విజయ సాయి రెడ్డి.
ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కథను పంచుకున్నారు . నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు.. “ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుoటున్నారు?” అని.
దీనికి ఆ దేవ దేవుడు శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ “ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు, లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు! అని ఎద్దేవా చేశారు విజయ సాయి రెడ్డి.
ఇదిలా ఉండగా ఇవాళ వైసీపీ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి లడ్డూ కల్తీ వివాదం మరింత ముదిరింది. వైసీపీ, అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ తరుణంలో విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ మరింత ఆసక్తిని రేపుతోంది.