బీఆర్ఎస్ ఖేల్ ఖతం
నటి విజయ శాంతి
హైదరాబాద్ – కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్కరొక్కరుగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని, రాబోయే రోజుల్లో ఇలాగే వలసలు కొనసాగడం ఖాయమని జోష్యం చెప్పారు. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ కాక తప్పదన్నారు విజయ శాంతి.
గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్ ) లో తాను ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, కానీ తనను అన్యాయంగా బయటకు పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కర్మ ఫలం ఇప్పుడు చూపిస్తోందని పేర్కొన్నారు.
అవసరానికి వాడు కోవడం , ఆ తర్వాత వదిలి వేయడం, కట్టె పుల్ల కంటే హీనంగా చూడటం కేసీఆర్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. దేవుడు అనే వాడు ఉన్నాడు కాబట్టే ఇవాళ కేసీఆర్ కు శాపం తగులుతోందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమం పేరుతో పవర్ లోకి వచ్చి సర్వ నాశనం చేశాడని, ఇవాళ పార్టీ లేకుండా పోతోందని , ప్రజల శాపం ఊరికే పోదని అన్నారు.