స్పష్టం చేసిన నటి రాములమ్మ
హైదరాబాద్ – నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం మొత్తం తెలంగాణ కోసం అంకితం చేశానని చెప్పారు. కేసీఆర్ పై ఎన్నో సార్లు పోరాటం చేశానని అన్నారు. ఉద్యమం పేరుతో ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు.
ఖజానా ఖాళీగా ఉన్నా రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నాడని ప్రశంసలు కురిపించారు. తనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినందుకు పార్టీ హైకమాండ్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
మరింత బాధ్యత పెరిగిందన్నారు. తన పని తాను చేసుకుంటూ పోతానని చెప్పారు. శాసన మండలి సభ్యురాలిగా ఎమ్మెల్యేల కోటా కింద పార్టీ విజయశాంతిని ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం గడువు కావడంతో తను నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు రాములమ్మ. సరైన వారికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినందుకు హైకమాండ్ ను అభినందించారు. ఎన్నో ఏళ్ల నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఎన్నో కేసులు నమోదు చేసినా తాను అదరలేదని పేర్కొన్నారు నటి విజయశాంతి.