పీకే అంచనాలు తప్పు
విజయశాంతి కామెంట్స్
హైదరాబాద్ – రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు , మాజీ ఎంపీ విజయ శాంతి. పీకే అంచనాలు వాస్తవంలోకి రావన్నారు. తెలంగాణలో బీజేపీకి రెండో స్థానం వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన గతంలో చేసిన విశ్లేషణలు వాస్తవంలో తప్పాయని పేర్కొన్నారు.
బీహార్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అంచనాలు తప్పాయని ఎద్దేవా చేశారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీకే చెప్పినవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ మేరకు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎవరి ప్రయోజనాల కోసం తను పని చేస్తున్నారో ప్రజలకు తెలిసి పోయిందన్నారు. తెలంగాణ యావత్ సమాజమంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని, తమకు 17 సీట్లు రావడం ఖాయమని జోష్యం చెప్పారు విజయ శాంతి.
తెలంగాణ ప్రత్యేకమైనదని, ఇక్కడి ప్రజలు, వారి ఆలోచనలు, భావోద్వేగాలు భిన్నమైనవని, అవి తెలుసు కోకుండా ప్రశాంత్ కిషోర్ ముందస్తు ఫలితాల పేరుతో కాంగ్రెస్ కు అంత సీన్ లేదని చెప్పడం భావ్యం కాదన్నారు.