ఎంపీ విజయ సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో విస్తృతంగా ఎంపీ పర్యటించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మోసం చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు. తన కొడుకు నారా లోకేష్ ను సీఎం చేయాలని కలలు కంటున్నాడని, ఈసారి కూడా బాబు అండ్ కంపెనీకి పరాభవం తప్పదన్నారు విజయ సాయి రెడ్డి. ఎన్నికలు వచ్చాయంటే చాలు బాబుకు పంట పండుతుందన్నారు.
ఒక్కో సీటు కావాలంటే రూ. 100 కోట్లు చెల్లించాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు . ఎవరినైనా తన వైపు తిప్పుకోవాలంటే డబ్బులు ఇస్తాడని, కానీ తాను సీటు ఇవ్వాలంటే బేరం పెడతాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు విజయ సాయి రెడ్డి.
అది ఏడు కోట్లా, 20 కోట్లా అనేది స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడని ఆగ్ఱహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలను అడిగినా చంద్రబాబు నాయుడు మోసం గురించి, బేరం గురించి చెబుతారంటూ ఫైర్ అయ్యారు ఎంపీ.