ఎన్నికల ప్రధాన అధికారి ఆవేదన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ( సీఈఓ) వికాస్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా ఓటింగ్ శాతం తక్కువ కావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఐపీఎల్ మేనియా నడుస్తోంది. కోట్లాది మంది జనం ఫిదా అయ్యారు. ప్రత్యేకించి క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ మ్యాచ్ లు చూసేందుకు ఎగ బడుతున్నారు. వేల కోట్ల రూపాయల ఆదాయం గడిస్తున్నారు.
ఈ సందర్బంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో వచ్చే నెల మే 13న పోలింగ్ జరగనుంది.
ఈ మేరకు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు. ఐపీఎల్ మ్యాచ్ లకు జనం ఫుల్ అవుతున్నారని కానీ ఓటేసేందుకు ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు.
ఈసారి ఎండలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం వికాస్ రాజ్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.