నాపై కుస్తీ గెలిచింది..నేను ఓడి పోయా
ఫ్రాన్స్ – పారిస్ ఒలింపిక్స్ 2024లో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్ దాకా వెళ్లి అనూహ్యంగా 100 గ్రాముల బరువు కారణంగా అనర్హత వేటు పడిన ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గురువారం పారిస్ నుంచే ట్విట్టర్ ఎక్స్ వేదికగా తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి తాను పాల్గొన బోనంటూ స్పష్టం చేశారు వినేష్ ఫోగట్. తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, నాలాంటి యువతీ యువకులు ఎందరో తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.
దేశం దాటి ఇతర దేశాలకు వెళ్లాలంటే ఎన్నో అడ్డంకులు అధిగమించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకే తాను రెజ్లింగ్ పోటీల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వినేష్ ఫోగట్. ఒక రకంగా చెప్పాలంటే నాపై కుస్తీ గెలిచిందని, కానీ తాను ఓడి పోయానంటూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా అధిక బరువు ఉందన్న నెపంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. అద్బ/తమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వినేష్ ఫోగట్ తన కెరీర్ లో అనూహ్యంగా వెనుదిరిగింది. యావత్ దేశం ఆమె పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. మద్దతు పలికింది.