మాపై సామాజిక బాధ్యత పెరిగింది
వినేష్ ఫోగట్..భజరంగ్ పూనియా
హర్యానా – ప్రముఖ భారతీయ రెజ్లర్లు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా సంచలన ప్రకటన చేశారు. తాము పని చేస్తున్న రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు షాక్ ఇచ్చారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తో భేటీ అయ్యారు.
అనంతరం హర్యానా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు వినేష్ ఫోగట్ , భజరంగ్ పూనియా. పార్టీలో చేరడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని స్పష్టం చేశారు .
క్రీడల్లో తాము చేసిన పోరాటాన్ని రాజకీయ వేదిక నుంచి దేశం కోసం, సమాజం కోసం కొనసాగించే అవకాశం ఇప్పుడు లభించిందని చెప్పారు.
ఈ ప్రయాణం కొత్త కలలు , సంకల్పాలతో నిండి ఉంటుందన్నారు వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా. దేశంలో సానుకూల మార్పు తీసుకు రావడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు భారతీయ రెజ్లర్లు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా, కేసీ వేణు గోపాల్ , తదితరులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.