NEWSNATIONAL

వినేష్ ఫోగ‌ట్ ఘ‌న విజ‌యం

Share it with your family & friends

తొలిసారి ఎన్నిక‌ల్లో గెలుపు

హ‌ర్యానా – రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాలు విస్తు పోయేలా చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు త‌ప్పాయి. హ‌ర్యానాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేసింది. ఊహిఒంచ‌ని రీతిలో బ‌రిలోకి దిగిన భార‌త మాజీ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ అపూర్వ విజ‌యం సాధించారు.

ఆమె జులానా శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలోకి దిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి కెప్టెన్ యోగేష్ బైరాగి, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి మాజీ రెజ్ల‌ర్ క‌వితా ద‌లాల్ పోటీ చేశారు వినేష్ ఫోగ‌ట్ కు వ్య‌తిరేకంగా.

6,000 కంటే పై చిలుకు ఓట్ల‌తో వినేష్ ఫోగ‌ట్ గెలుపొందిన‌ట్లు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు.
ఇదిలా ఉండ‌గా ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ లో జ‌రిగిన పోటీల్లో పాల్గొన్నారు. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఎందుక‌నో ఆమెపై అన‌ర్హ‌త వేటు ప‌డింది.

చివ‌ర‌కు అంద‌రికీ బిగ్ షాక్ ఇచ్చారు వినేష్ ఫోగ‌ట్. తాను రెజ్లింగ్ క్రీడా రంగం నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌త నెల సెప్టెంబ‌ర్ 6న కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ‌త ఏడాది రెజ్ల‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్ , ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. చివ‌ర‌కు అరెస్ట్ కూడా అయ్యారు. దేశ వ్యాప్తంగా వినేష్ ఫోగ‌ట్ సెన్షేష‌న్ గా మారారు. మొత్తంగా అనుకున్న‌ది సాధించారు వినేష్ ఫోగ‌ట్.